Vikarabad | బీఆర్ఎస్ లో చేరిన బూరుగుపల్లి అనంతరెడ్డి

వికారాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో అనంతరెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి ఆనంద్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన గ్యారెంటీలను ఏమాత్రం నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. ఈకార్యక్రమానికి వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కుమ్మరపల్లి గోపాల్, మాజీ కౌన్సిలర్ సీ.అనంతరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ మండల అధ్యక్షుడు, నాయకుడు మహిపాల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply