మంత్రి వివేక్ వెంకటస్వామి

మంత్రి వివేక్ వెంకటస్వామి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కొత్తగా 2లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి జూన్ 2 నుంచి వారికి పింఛన్ల పంపిణీ చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈరోజు (ఆదివారం) మిర్యాలగూడలో ఆయన పర్యటించి విలేకరులతో మాట్లాడారు.
ధాన్యం కొనుగోలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ, నకిరేకల్‌లలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని.. ఇందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణ కోసం ఆయా ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఫార్మారంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధివిధానాల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
