BRS | ఖండించిన బీఆర్ఎస్ పార్టీ

BRS | ఖండించిన బీఆర్ఎస్ పార్టీ

BRS | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.. సింగరేణికి సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో ఆయనపై చర్యలు చేపట్టినట్లు ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే బీఆర్ఎస్ పార్టీ దీనిపై స్పందించింది. అరెస్ట్ వార్త‌ల‌ను ఖండించింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న అరెస్ట్ వార్తలు పూర్తిగా అసత్య ప్రచారమని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ నేత ఎక్కడికీ వెళ్లలేదని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉన్నాడని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది.

Leave a Reply