Axe | భార్య కాలు నరికిన భర్త…

Axe | భార్య కాలు నరికిన భర్త

Axe | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అమానుషంగా దాడి చేసి ఆమె కాలును నరికిన సంఘటన సంచలనం సృష్టించింది.

పల్నాడు జిల్లా తొండపిలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానం పెంచుకున్న లక్ష్మయ్య అనే వ్యక్తి తన భార్య భూలక్ష్మీపై గొడ్డలితో దాడి చేసి ఆమె కాలును నరికాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భూలక్ష్మీ ప్రాణాపాయ స్థితిలో ఉండగా, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక నరికిన కాలును సంచిలో వేసుకుని లక్ష్మయ్య స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవడం మరింత కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 Axe |

తన భార్యకు వేరే వారితో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భర్త గొడ్డలితో ఆమె కుడికాలును నరికి వేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం, తొండపి గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ముప్పాళ్ళ ఎస్సై కె అనిల్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొండపి గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు.లక్ష్మయ్యకు తన భార్య భూలక్ష్మి పై అనుమానం ఏర్పడింది.

ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం లక్ష్మయ్యను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో గురువారం భార్యా, భర్తల మధ్య గొడవ జరిగింది. వారి మధ్య జరిగిన గొడవ కాస్త ముదిరి, కట్టెలు నరికే గొడ్డలితో భూలక్ష్మి రెండు కాళ్లపై విచక్షణారహితంగా భర్త లక్ష్మయ్య దాడి చేశాడు. ఈ దాడిలో కుడి కాలు మనికట్టు వరకు భూలక్ష్మి కోల్పోవడం జరిగింది.

ఈ సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే భూలక్ష్మిని అంబులెన్స్ లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం ప్రస్తుతానికి లేదని తెలిపారు. అయినా కూడా ఆమెను కుటుంబ సభ్యులు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ముప్పాళ్ళ ఎస్సై అనిల్ కుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply