on4yrsboy | కుటుంబంలో అసూయ సెగ…

on4yrsboy | కుటుంబంలో అసూయ సెగ…

on4yrsboy | నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్ తాగించిన పిన్ని!

on4yrsboy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రక్తసంబంధాల మధ్య అనురాగం ఉండాలి.. కానీ అదే రక్తసంబంధం పగగా మారితే? కంటికి రెప్పలా కాపాడాల్సిన చేతులే కాలకూట విషాన్ని అందిస్తే?
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఒక అమానుష ఘటన ఇప్పుడు సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న అసూయకు పరాకాష్టగా నిలుస్తోంది. ఒక పసివాడిపై పిన్ని చూపించిన కక్ష.. మానవత్వానికే మచ్చ తెచ్చింది.

on4yrsboy | ప్రేమే నేరమైందా?
బోడుప్పల్ శ్రీనివాస కాలనీకి చెందిన పర్వతం సతీష్ కుమార్, అంజమ్మలది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ ఇంట్లో సందడి చేసే నాలుగేళ్ల మనవడు అంటే తాతకు ప్రాణం. పెద్ద కుమారుడు నాగరాజు కొడుకుపై తాత అమితమైన ప్రేమను కురిపించేవాడు. అయితే, ఆ వృద్ధుడి వాత్సల్యం చిన్న కోడలు మంజులకు కళ్లమంటగా మారింది. తన బిడ్డను కాదని, పెద్ద కుమారుడి కొడుకును మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న అసహనం ఆమెలో మొలకెత్తింది.

అసూయ నుంచి అమానుషం వరకు..
ప్రేమను సమానంగా పంచలేదన్న చిన్నపాటి అసంతృప్తి, కాలక్రమేణా ఆ చిన్నారిపై పగగా మారింది. అది ఎంతలా అంటే.. ఆ పసివాడు ఈ లోకంలో లేకపోతేనే తన బిడ్డకు ప్రాధాన్యత దక్కుతుందన్న వికృత ఆలోచన ఆమెలో మొదలైంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఆ నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించింది. ఆ పసివాడు గుక్కెట్టి ఏడుస్తున్నా, గొంతు కాలి విలవిలలాడుతున్నా ఆ పిన్ని మనసు కరగలేదు.

తీవ్ర కలకలం..
చిన్నారి అరుపులు విని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న కోడలు మంజుల చేసిన ఈ పనితో ఆ కుటుంబం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైపోయింది.

ఒక చిన్న అసూయ ఎంతటి ఘోరానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాల కంటే.. ‘నా వారు, నీ వారు’ అనే స్వార్థం పెరిగిపోయి పసి ప్రాణాలను బలితీసుకునే స్థాయికి చేరడం నిజంగా శోచనీయం. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కుటుంబాల్లో మానసిక పరిపక్వత చాలా అవసరం.

Leave a Reply