వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్..

వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్..

సర్వీస్ నుంచి డిస్మిస్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా, నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ పార్టీ తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం.. ఆయన నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి ఈ మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. వెంకటరామిరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. సర్వీస్ నుంచి డిస్మిస్ కావడంతో ఆయన తనకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు, జీవితకాల పెన్షన్ బెనిఫిట్స్ ను కూడా పూర్తిగా కోల్పోనున్నారు.

Leave a Reply