యాదాద్రి భువనగిరి : బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. భువనగిరి మండలం వడైగూడెం సమీపంలో లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు.