సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

నర్సంపేట, ఆంధ్రపభ : తెలంగాణ అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఆమోదంపై నర్సంపేట బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్ర పటాలకు నర్సంపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోడిధల సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఆమోదం పొందడం ప్రతి న్యాయవాదికి గర్వకారణం అన్నారు.

సాధించిన విజయానికి వెనుక అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల కృషి నిరంతర పోరాటం, ఉద్యమాలు, త్యాగాలు దాగి ఉన్నాయన్నారు. ప్రతి అడుగు పోరాటంతో ప్రతి నిమిషం అంకితభావంతో ముందుకు సాగిన న్యాయవాదుల కృషి ఫలితమే ఈ చట్టాన్ని పేర్కొన్నారు. ఈ బిల్ ఆమోదం ద్వారా న్యాయవాదుల గౌరవం మరింత పెరిగిందనీ, వారి భద్రతకు ఒక బలమైన హామీ లభించిందన్నారు. ఇది న్యాయవాదుల గౌరవానికి ప్రభుత్వం ఇచ్చిన సత్కారంగా పేర్కొన్నారు.

ఈ చట్టాన్ని ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీకి నర్సంపేట బార్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ న్యాయవాదుల ఐక్యత, పట్టుదల, న్యాయం కోసం చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుం దన్నారు.ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మార్గదర్శ కులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నర్సంపేట బార్ అసోసియేషన్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారూ. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply