Trains | పండుగ రద్దీ.. 10 ప్రత్యేక రైళ్లు

Trains | పండుగ రద్దీ.. 10 ప్రత్యేక రైళ్లు
- హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు
Trains | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పండుగ సెలవుల కారణంగా పట్టణంలో ఉండే ప్రజలు పండుగ కోసం పల్లెలకు బయల్దేరుతున్నారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్- విజయవాడ మధ్య దక్షిణ మధ్య రైల్వే 10 అదనపు ప్రత్యేక రైళ్లు(Trains) ప్రకటించింది.
ఈనెల 11, 12, 13, 18, 19వ తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఈ నెల 10, 11, 12, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఛైర్ కార్, జనరల్ బోగీలతో ఇవి రాకపోకలు సాగించనున్నాయి.
