Bhupalpally | పారదర్శకంంగా అంగన్‌వాడీ టీచర్ పదోన్నతుల ప్రక్రియ

Bhupalpally | పారదర్శకంంగా అంగన్‌వాడీ టీచర్ పదోన్నతుల ప్రక్రియ
- అవస్తవాలను ఖండిస్తున్నాం
- జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి
Bhupalpally | భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీ ఆయా నుండి టీచర్ పదోన్నతుల ప్రక్రియలో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలు కేవలం నిరాధారమైనవని, వాస్తవ విరుద్ధమైనవని, వాటిని ఖండిస్తున్నామని భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి స్పష్టం చేశారు. పదోన్నతులు అంగన్‌వాడీ ఆయా పదోన్నతుల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, జీవోలు, జిల్లా సెలెక్షన్ కమిటీ నిబంధనలకు లోబడే నిర్వహించబడిందని తెలిపారు.
జిల్లా స్థాయి కమిటీ ద్వారా అభ్యర్థుల అర్హత, సర్టిఫికేట్లు, జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడిందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదని తెలిపారు. డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు. అభ్యర్థుల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా పరిగణించి, ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి తెలిపారు.
