pharma company | నిర్మాణ పనులు నిలిపివేయాలి..

pharma company | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫార్మా కంపెనీ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పట్టణ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ‌ పంచాయితీ కార్యదర్శి మహేష్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ… ఫార్మా కంపెనీ వల్ల జల, వాయు కాలుష్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఫార్మా వద్ద జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో నిర్మాణాన్ని వ్యతిరేకించడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply