Ambulance | గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్…

Ambulance | గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్…

Ambulance | మక్తల్, ఆంధ్రప్రభ : అధికారం చేతికొచ్చిందా అందిన కాడికి దోచుకోవడం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా భావిస్తున్న ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో ప్రజలే ముఖ్యం వారి ప్రాణాలే నాకు ప్రధానం అంటూ ప్రజాసేవ కోసం అధికారం చేతిలోకి వచ్చిన 15 రోజుల్లోనే లక్షల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి కాపాడేందుకు అవసరమైన అంబులెన్స్(Ambulance) సమకూర్చాడు సర్పంచ్. అతడే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని రోజు మందన్ గోడ్ గ్రామ సర్పంచ్ కలాల్ రాజేందర్ గౌడ్. గ్రామ ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో నూతన అంబులెన్స్‌ను కొనుగోలు చేశారు.

గ్రామంలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తీసుకున్న ఈ నిర్ణయం పలువురికి ఆదర్శప్రాయమైనదని చెప్పవచ్చు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, గ్రామాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలన్న సర్పంచ్ సేవలు ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తాయని చెప్పవచ్చు. యువకుడైన సర్పంచ్ రాజేంద్ర గౌడ్ గ్రామసభ హాజర విమానాలతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎంజాయ్ తెలిపిన పోటీ చేసే సర్పంచిగా నూతనంగా ఎన్నికయ్యారు.

గెలుపొందిన అనంతరం ఎలాంటి రంగు ఆర్భాటాలు చేయకుండా ప్రజలందరినీ తెలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎన్నికలకు ముందే తెలిసినప్పటికీ మరోసారి అందరితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు పొందుతున్నప్పుడు మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యమే తనకు ప్రధానమని వారికోసం దేనికైనా సిద్ధమని అన్నారు.

ప్రజలకు విద్య వైద్యం రవాణా సౌకర్యాలకు ధనవంతు సహకారం అందిస్తారని అన్నారు. సర్పంచ్ రాజేంద్ర గౌడ్ సొంతంగా డబ్బులు వచ్చింది అంబులెన్స్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply