Balkonda | “ఆంధ్రప్రభ” క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్

Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : బాల్కొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం “ఆంధ్రప్రభ” 2026 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను బాల్కొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రభ” తెలుగు దినపత్రిక అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

నిజాన్ని నిర్భయంగా వార్తలు రాసి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ వనజ, ఆంధ్రప్రభ రిపోర్టర్ పిల్లేండ్ల శివప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ లు ఫహీం, సురేష్, సాయికృష్ణ, విశాల్, రజిత, రికార్డు అసిస్టెంట్ షాదుల్లా, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్, గిరి, జీపీవో రాజేశ్వర్, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply