Gustavo Petro | తగ్గేదేలే అంటున్న కొలంబియా

Gustavo Petro | తగ్గేదేలే అంటున్న కొలంబియా

  • అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు వార్నింగ్‌
  • ప్ర‌పంచంలో రానున్న మ‌రో యుద్ధం

Gustavo Petro | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచంలోని ప‌రిస్థితులు గ‌మ‌నిస్తుంటే మ‌రో యుద్ధం జ‌ర‌గుబోతుందా? అంటే అవును అనేవాళ్లే ఎక్కువ‌గా ఉన్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌-ర‌ష్యా (Ukraine Russia) మ‌ధ్య యుద్ధం జ‌రిగిన సంగ‌తి విదిత‌మే. అయితే ఇప్పుడిప్పుడే యుద్ధానికి ముగింపు చెప్పారు. ఇంత‌టిలో చ‌మురు ఉత్ప‌త్తి దేశాలతో అమెరికా క‌య్యానికి కాళ్లు దువ్వుతుంది. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే యుద్ధ మేఘాలు క‌మ్మకొస్తున్నాయ‌ని చెప్పొచ్చు. అమెరికాకు ధీటుగా కొలంబియా కూడా త‌గ్గ‌డం లేదు.

Gustavo Petro | త‌గ్గ‌ని కొలంబియా

కొలంబియా అధ్య‌క్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇచ్చారు. ఒక‌వేళ అమెరికా (America) త‌మ దేశంపై దాడి చేస్తే, అప్పుడు ఆయుధాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వెనిజులా దేశాధ్య‌క్షుడు మ‌దురోను నిర్బంధించిన త‌ర్వాత డోనాల్డ్ ట్రంప్ ప‌లు లాటిన్ దేశాల‌కు వార్నింగ్ ఇచ్చారు. కొకైన్ మాద‌క‌ద్ర‌వ్యాన్ని ట్రాఫికింగ్ చేసిన‌ట్లు పెట్రోపై ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న్ను కూడా త్వ‌ర‌లో ప‌ద‌వీచ్యుతున్ని చేయ‌నున్న‌ట్లు ట్రంప్ వార్నింగ్‌లో పేర్కొన్నారు. కొలంబియాపై సైనిక చ‌ర్య చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా ట్రంప్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో పెట్రో రియాక్ట్ అయ్యారు.

Gustavo Petro

Gustavo Petro | నాకూ యుద్ధం గురించి తెలుసు…

తానేమీ మిలిట‌రీ వ్య‌క్తిని కాదని, కానీ యుద్ధం గురించి తెలుసన‌ని కొలంబియా అధ్య‌క్షుడు గుస్తావో పెట్రో (Gustavo Petro) అన్నారు. 1989లో జ‌రిగిన శాంతి ఒప్పందం ప్ర‌కారం ఆయుధాన్ని ప‌ట్టుకోను అని, త‌న‌ స్వ‌దేశం కోసం మాత్రం ఆయుధాన్ని చేత‌బూనాల్సి వ‌స్తుంద‌ని పెట్రో అన్నారు. 2022లో కొలంబియా వామ‌ప‌క్ష అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. ఎం-19 క‌మ్యూనిస్టు గెరిల్లా గ్రూపులో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. 1980 త‌ర్వాత ఆయుధాలు వీడి, కొలంబియా ప్ర‌ధాన రాజ‌కీయాల్లో చేరారు. అయితే అధికారం చేప‌ట్టిన త‌ర్వాత కొకైన్ ట్రేడ్‌ను అణిచివేశారు. కోకా ఆకు చెట్ల పంట‌ను అడ్డుకున్నామ‌ని, కోకా పంట సాగు నిలిపివేశామ‌ని చెప్పారు. దాని స్థానంలో ఇత‌ర పంటలు వేసేలా ప్రోత్స‌హించిన‌ట్లు స్పష్టం చేశారు.

Gustavo Petro | రెండు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొదలైంది

అమెరికా, కొలంబియా దేశాధినేత‌ల మ‌ధ్య వార్నింగ్‌లు (Warning) ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఏ క్ష‌ణానైనా యుద్ధం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని కొలంబియా కూడా అప్ర‌మ‌త్త‌మైంది. త‌న సైనిక బ‌లాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ప్ర‌పంచ నియంత‌గా ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వెనుక్కు త‌గ్గ‌ర‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Gustavo Petro

CLICK HERE TO READ ఆ కిక్కే వేరబ్బా Andhra Prabha News

CLICK HERE TO READ MORE

Leave a Reply