Voter list | తుది ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీ లు సహకరించాలి

Voter list | తుది ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీ లు సహకరించాలి

Voter list | మోత్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుది ఓటర్ జాబితా(Voter list) తయారీ కోసం రాజకీయ పక్షాలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ అన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ… వార్డుల డీ లిమిటేషన్ ను మార్చి దూరంగా ఉన్న ప్రాంతాలను సమీపంలో ఉన్న ఒకే వార్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 10 న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సి ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ సతీష్,మేనేజర్ ప్రభాకర్, డిప్యూటీ తహశీల్దార్ వెంకటేష్,ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply