Thorrur | కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మునిసిపాలిటీ అభివృద్ధి

Thorrur | కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మునిసిపాలిటీ అభివృద్ధి

Thorrur | తొర్రూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హమ్యా నాయక్ అన్నారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన ఆదివారం పట్టణంలోని 14వ వార్డులలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తొర్రూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు అందించడం జరిగిందని, రెండో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు.

త్వరలో పేదలను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు కోట్లాది రూపాయలు మంజూరు చేసి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, డాక్టర్ పొనుగొటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, కంచర్ల వెంకట చారి, నాయకులు గుండాల నరసయ్య, జలకం శ్రీనివాస్, నర్కూటి గజానంద్, దొంగలి రేవతి శంకర్, బిజ్జాల అనిల్, కుషాల్, ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, గూడెల్లి రామచంద్రయ్య, అమల, మనోహర్, మహేష్ యాదవ్, రమేష్, కుమార్ యాదవ్, నడిగడ్డ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply