Tadvai | ఘనంగా హనుమాన్ చాలీసా

Tadvai | ఘనంగా హనుమాన్ చాలీసా

Tadvai | తాడ్వాయి, (ఆంధ్ర ప్రభ): సనాతన ధర్మం ధ్యేయంగా ప్రతీ ఒక్కరికి హనుమాన్ చాలీసా పారాయణం నేర్పాలనే సంకల్పంతో హనుమాన్ మాల భక్తుడు, గురువు సంగేపు మురళి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మాసుల ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మొదటివారం 15 మంది పిల్లలతో ప్రారంభం చేసి ఆరు వారాలకు 130 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందన్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటిలోని పిల్ల‌ల‌కు హనుమాన్ చాలీసా పారాయణం నేర్పాలని సంకల్పంతో ఉన్నామన్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో పిల్లలకు ఆధ్యాత్మికంగా, చెడు వ్యసనాలకు గురికాకుండా వారి మైండ్‌ను చదువుపై ఆధ్యాత్మికత‌పై అలవర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

హనుమంతుని పుట్టుక, గుణగణాలు చేసిన సేవలు అతని ధైర్యం భక్తి పిల్లలకు వివరించడం జరిగిందని అన్నారు. వీటితోపాటు త్రికాల సంధ్య నేర్పించడం జరుగుతుందని అన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి పిల్లల కోసం అంబీర్ నరేందర్రావు లక్ష్మీబాయి దంపతులు తమ వంతు సహాయంగా అల్పాహారం ఇడ్లీ వడ, అరటి పళ్ళు పిల్లలకి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మూగ నర్సింహులు శారద దంపతులు పిల్లలకు 50 కండువాలు , హనుమాన్ లాకెట్లు వితరణ చేయడం జరిగిందని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం శ్రీరామరామి రోజు ప్రతి పిల్లవాడితో చదివించడమే లక్ష్యంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివ పంతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, సర్పంచ్ రంజిత్ రెడ్డి, అంబీర్ శివాజీ రావు, పత్తి రమేష్, ఎండిగే మైపాల్, భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply