Punishment | రోడ్డుపై న‌డిపించుకుంటూ..

Punishment | రోడ్డుపై న‌డిపించుకుంటూ..

  • మందుబాబుల‌కు పోలీసులు పనిష్మెంట్
  • ముగ్గురిని రహదారిపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

Punishment | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : మచిలీపట్నంలో తాగుబోతులకు పోలీసులు నూతన పనిష్మెంట్ ఇచ్చారు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. శనివారం రాత్రి గణేష్ భవన్‌పై తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు.

ఎస్పీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను ఆర్.పేట సీఐ యేసుబాబు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిటీ కేబుల్ నుంచి కోనేరుసెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించారు. రౌడీమూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్‌కు ఓ హెచ్చరికగా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని మీడియాకు సీఐ యేసుబాబు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ యేసుబాబు తెలిపారు.

Leave a Reply