AP | మొట్టమొదటి నూతన ఈ ఆఫీసు …

AP | మొట్టమొదటి నూతన ఈ ఆఫీసు …

  • సింగ్ నగర్ లో ప్రారంభం…
  • వైద్య సిబ్బంది, అధికారులతో సమావేశం…
  • ఈ ఆఫీసు ద్వారా రోగులకు మెరుగైన వైద్యం…
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎం.సుహాసిని.

AP | పాయకాపురం (విజ‌య‌వాడ), ఆంధ్రప్రభ : జిల్లాలోని మొట్టమొదటి నూతన ఈ ఆఫీసు సింగ్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించబడింది. జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని ఇవాళ‌ ఈ ఆఫీసును ప్రారంభించి, వైద్య సిబ్బంది, అధికారులతో ట్రైనింగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఆఫీసు కార్యక్రమం ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సన్నాహక కార్యక్రమాలు చేపట్టిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎం.సుహాసిని పేర్కొన్నారు.

AP

జిల్లాలోని అందరు వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లకు, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ ఆఫీసుపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆమె కోరారు. ఆతర్వాత జిల్లాలో మొదట‌గా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అజిత్ సింగ్ నగర్ లో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను పరిశీలించి అక్కడకు వచ్చిన, రోగులకు వారి ఆధార్ కార్డు తెచ్చుకోమని, ఈ ఆధార్ కార్డు ద్వారా అభ‌ ఐడిని రూపొందించుకోమని, తద్వారా ప్రజలు పొందిన సేవలన్నీ ఆధునీకరించబడి, ఈ హెచ్ ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డుగా మారి మీరు ఎక్కడికి వెళ్లినా ఆ నెంబర్ తో అక్కడ ఉన్న డాక్టర్లు చూసే విధంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యాధికారి డీఈఓతో వారు చేస్తున్న‌ఈ హెచ్ఆర్ అప్లోడింగ్ ని పరిశీలించి సూచనలు చేశారు. ఆస్పత్రిలో రోగుల‌కు అందుతున్న అన్ని సేవలను పరిశీలించి, తదుపరి ఈఆఫీస్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించారు.

Leave a Reply