MLA | ఈఏడాది అందరికీ మంచి జరగాలి…

MLA | ఈఏడాది అందరికీ మంచి జరగాలి…
- ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సన్మానం, శుభాకాంక్షలు
MLA | సిర్పూర్( యు) ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి ఇవాళ సిర్పూర్ (యు) మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొడసం ధర్మారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kovalakshmi)కి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నూతన సంవత్సరం అందరికీ మంచి కలగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు అర్క నాగోరావు, పవర్ గూడ సర్పంచ్ కురుకుటె కమల ప్రహ్లాద్, ఉప సర్పంచ్ మధుకర్, బాబ్జిపేట్ సర్పంచ్ ఆత్రం మాధవ్ రావు, మండల నాయకులు ఆత్రం ప్రకాష్, ఆత్రం మోతిరం, తోడసం జూగాది రావు, అత్రం దేవరాజ్, ఆడ ప్రకాష్, తోడసం జైవంత్ రావు, వెడ్మ సాగర్, కొట్నాక్ భగవంత రావు, ఎమ్మెల్యే అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
