Minister | ఉపాధ్యాయ సమస్యలు త్వరలో పరిష్కారం

Minister | ఉపాధ్యాయ సమస్యలు త్వరలో పరిష్కారం

  • రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
  • పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ రంగ సమస్యలు త్వరలోనే పరిష్కారమ‌వుతాయని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ పీఆర్టీయూ టీఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వై.జనార్దన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు తిరుపతి ఆధ్వర్యంలో మంత్రి పీఆర్ టీయూటీఎస్ 2026 నూతన సంవత్సర టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయుల సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పీఆర్టీయూ టీఎస్ టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తో మాట్లాడుతున్నారని అన్నారు. త్వరలోనే 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు త్వరలోనే వచ్చేలా, అందరు సంతృప్తి చెందేలా మంచి ఫిట్మెంట్‌తో పీఆర్సీ వచ్చేలా తన వంతుగా ఉపాధ్యాయుల పక్షాన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేలా ప్రయత్నం చేస్తానని మంత్రి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము పైలెట్ గా మండలానికి ఒక పాఠశాలలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ని ప్రవేశపెట్టబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంత్రితో అన్ని విషయాలు చర్చిస్తూ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినకుండా పీఆర్సీ, డీఏలు పెండింగ్ బిల్లులు వెంటనే వచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.


కార్యక్రమంలో మక్తల్ మండల శాఖ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాబు, నారాయణ పేట మండలం అధ్యక్షులు ఎం. రఘువీర్, దామర్ గిద్ద మండలం అధ్యక్షులు సత్య నారాయణ రెడ్డి, మాగనూరు మండల అధ్యక్షులు బలరాం, ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, ఉట్కూరు మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి అజయ్, మరికల్ మండలం ప్రధాన కార్యదర్శి ముస్తఫా, ధన్వాడ మండలం ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మణ్, నర్వ మండలం అధ్యక్షులు వెంకటేష్, మక్తల్ మండలం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర జిల్లా బాధ్యులు నర్సింహా రెడ్డి, విధుర్ కుమార్, సనత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్, గాయత్రి రమేష్, బాలు రాజు, అనిల్ కుమార్, శివరాజ్, రహీం, వెంకట్ రెడ్డి, మారుతి, రామ్ కిరణ్, ప్రశాంత్ కుమార్, వరుణ్, వెంకటయ్య, కుర్మాయ్య, గురురాజా, అనిత, శ్వేత, రజని, చంద్రకళ, గీత, అశోక్ కుమార్, ఆనంద్, తిమ్మప్ప, తీర్మాలరావు, శ్రీనువాసు నాయక్, చంద్రశేఖర్, రాజశేఖర్, ఆర్‌కె.అశోక్, కే. అశోక్, ఆంజనేయులు, నాగరాజు, రఘు వర్మ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply