Honored | వేడుక‌ల్లో స‌న్మానం

Honored | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సిర్పూర్ (యు) నూతన సర్పంచ్ ఆత్రం ప్రకాష్‌కు హెచ్ఎం ఆత్రం దత్తు ఉపాధ్యాయులు విద్యార్థులు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సర్పంచ్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీపీ యూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆత్రం దత్తు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆంధ్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply