Cricket | ష‌మీ.. రెడీ..!

Cricket | ష‌మీ.. రెడీ..!

  • దేశవాళీ క్రికెట్‌లో అద‌ర‌కొడుతున్న పేసర్
  • న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసే యోచనలో సెలెక్టర్లు

Cricket | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : మోకాలి, చీలమండ గాయాలతో జ‌ట్టుకు దూర‌మైన టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మ‌ళ్లీ బ‌రిలో దిగాడు. సర్జరీ, సుదీర్ఘ రీహ్యాబిలిటేషన్(Rehabilitation) తర్వాత దేశవాళీ క్రికెట్‌లో షమీ అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు(20 wickets) పడగొట్టి త‌న ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అలాగే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ కలిపి 17 వికెట్లు తీశాడు.

దీంతో షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కేవలం రాబోయే సిరీస్‌ల కోసమే కాకుండా 2027 వన్డే ప్రపంచకప్‌(World Cup)ను దృష్టిలో ఉంచుకుని షమీకి జట్టులో చోటు కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. షమీ చివరిసారిగా 2025 మార్చిలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడాడు. ఆ టోర్నీలో 9 వికెట్లు తీసి సత్తా చాటాడు.

Leave a Reply