Development | వైకుంఠ ఏకాదశి సందర్భంగా…

Development | వైకుంఠ ఏకాదశి సందర్భంగా…
Development | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఈ రోజు ఉదయం కదిరి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు.
ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం దీపారాధన(Deeparadhana)లో పాల్గొని, స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా కలెక్టర్ స్వామి వారి ఎదుట నమస్కరించి జిల్లా ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం, జిల్లా అభివృద్ధి కోసం ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తులతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కలెక్టర్ వెంట కదిరి ఆర్డీవో వీవీఎస్ శర్మ, ఆలయ అధికారులు, రెవిన్యూ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
