EXPRESS | రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి విచారం

EXPRESS | రైలు ప్రమాదంపై కేంద్రమంత్రి విచారం

EXPRESS | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలులో యలమంచిలి వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన బాధాకరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుడు చంద్రశేఖర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలను రైల్వే డివిజనల్ అధికారులను అడిగి తెలుసుకున్నానని, సహాయక చర్యలు వేగవంతం చేయడం, లైన్ల పునరుద్ధరణ త్వరితగతిన చేయాలని రైల్వే డీఆర్ఎంకు సూచించారు.

CLICK HERE TO READ ఉన్న‌త విద్య కోసం వెళ్లి… అనంత‌లోకాల‌కు!

CLICK HERE TO READ MORE

Leave a Reply