BJP leaders | డోన్‌లో మన్ కీ బాత్

BJP leaders | డోన్‌లో మన్ కీ బాత్

  • వీక్షించిన స్థానిక బీజేపీ నాయకులు

BJP leaders | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో బీజేపీ నాయకులు స్థానిక కార్యాలయంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మనసులో మాట కార్యక్రమం చేపట్టారు. ప్రధాని దేశ ప్రజల అభ్యునతి కోసం నెలలో ఒక రోజు కేటాయించి ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తూ దేశ ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ప్రధాని మాట్లాడుతూ… 2025 సంవత్సరం పూర్తి కావొచ్చిందన్నారు. ఈ ఏడాది మనం సాధించిన ఎన్నోన్నో విజయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా దేశ రక్షణ, క్రీడా మైదానాల వరకు ప్రపంచంలో మన దైన ముద్ర వేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కానీ, మహిళా క్రికెట్‌లో ప్రపంచ కప్పు గెలుపు కానీ ముఖ్య మైనవి, అలాగే వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు.

యువత ట్రాఫిక్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. ఆ ఏపీ ప్రభుత్వం నాబార్డ్‌తో కలిసి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తూ, వారిని మార్కెట్‌లో కూడా అగ్రస్థానం నిలుపుతుందన్నారు. మనకీ బాత్ ముఖ్య ఉద్దేశం పురాతన కళాకారులను గుర్తు చేసుకోవడం, సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులను గుర్తు చేసుకోవడం ఒక భాగం అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి, విశ్వకర్మ నొమ్బెర్ ఆర్మీ రామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీ చలపతి రావ్, కిసాన్ మోర్చా నాయకులు హరి నాయుడు, చెన్నారెడ్డి, బీజేపీ నాయకులు గొల్ల రాజు, సుధాకర్, నాగరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply