Utkur | రెండు బైకులు ఢీకొని..

Utkur | రెండు బైకులు ఢీకొని..
- ఒకరికి తీవ్ర గాయాలు
Utkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన తాపీమేస్త్రీకి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. ఊట్కూర్ మండల కేంద్రంలోని మెయిన్ బజార్ వీధికి చెందిన కుమ్మరి లక్ష్మణ్ తాపీ మేస్ర్తీగా పనిచేస్తుంటాడు. అతను నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్‌లోని అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి స్వగ్రామమైన ఊట్కూర్కు వస్తున్నాడు. సింగారం స్టేజి సమీపంలో జాజాపూర్ గ్రామానికి చెందిన మరో బైకు లక్ష్మణ్ వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో లక్ష్మణ్ తోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్ కాలు చేయి విరిగిపోవడంతో పాటు తలకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
