Nalgonda | ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి…

Nalgonda | ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి…

Nalgonda | చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజా ప్రతినిదులు(representatives) ప్రజలకు సేవకులుగా ఉండాలి కానీ, పేరు కోసం పాకులాడకూడదని సీపీఎం, వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక(Local) మేకల లింగయ్య స్మారక భవనంలో ఈ రోజు జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా మేజర్ గ్రామ పంచాయతీ వెలిమినేడు గ్రామ సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య,మల్లం మహేష్, జిట్ట సరోజ, అరూరి శ్రీను, పామనుగుళ్ళ అచ్చాలు, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహా, బొబ్బిలి సుధాకర్ రెడ్డి,నెలికంటి నర్సింహా,జిట్ట స్వామి, పంది నరేష్, కల్లూరి కుమార స్వామి, కందగట్ల గణేష్, దేశబొయిన సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply