Buddha Prasad | పరిశుభ్రత అందరి బాధ్యత

Buddha Prasad | పరిశుభ్రత అందరి బాధ్యత

  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
  • స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే బుద్దప్రసాద్

Buddha Prasad | ఘంటసాల, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు దేవరకోట గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆయన పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఇళ్ల పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరి చేరని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు వ్యాప్తి చెంది వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశాల మేరకు స్వచ్ఛ కార్యక్రమాలు గ్రామపంచాయతీల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, సర్పంచ్ మద్దాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ కొప్పుల రాములమ్మ, ఎంపీడీవో సుబ్బారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply