TDP | సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

TDP | సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

  • చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ అవార్డు
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన టీడీపీ నాయ‌కులు

TDP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ అవార్డు రావ‌డం రాష్ట్రానికి గర్వకారణం అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని పార్టీ మండల కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక కావ‌డం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమ‌ని వెంకట్రామ్ అన్నారు. నాయకులు యాసం చిట్టిబాబు, మాచవరపు ఆదినారాయణ, బచ్చు రఘునాథ్‌ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply