Municipal | మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి..

Municipal | మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి..
Municipal | బోధన్, ఆంధ్రప్రభ : సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా బోధన్ మున్సిపల్ అభివృద్ధి(Municipal development)కి ప్రజలు సహకరించాలని ఆరు గ్యారంటీల ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇవాళ బోధన్ పట్టణంలో చెత్త సేకరణకు నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలను ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… వేగంగా చెత్త తరలించడం కోసం నూతనంగా ఆటోలు కొనుగోలు(purchase) చేసినట్లు వివరించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఇందువల్ల పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టే వీలుంటుందని సూచించారు. ఆటోలను సక్రమంగా వినియోగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనం పల్లి ఎల్లయ్య, తదితరులున్నారు.
