Power Star | డ్యాన్ చేస్తే.. భూకంపం..

Power Star | డ్యాన్ చేస్తే.. భూకంపం..
Power Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కోసం పవర్ ఫ్యాన్స్(Power fans) ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాలిడ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ మూవీ నుండి దేఖ్లేంగే సాలా.. అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఈ పాటలో పవన్ తన పవర్ మరోసారి చూపించబోతున్నారు అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్స్(Catchy tunes)కి పవన్ వేస్తున్న స్టెప్పులు అదిరిపోయాయి.
Power Star | రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం..
రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవి కుమార్(Bhaskarabhatla Ravi Kumar) రాయగా, విశాల్ దడ్లానీ పాడారు. దేవిశ్రీ సంగీతం అందించారు. పూర్తి పాటను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నారు. నిజంగానే పవన్ స్టెప్ వేస్తే.. భూకంపం వస్తుందన్నట్లుగా ఇందులో కొరియోగ్రఫీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. పవర్ స్టార్.. ట్రెండీ లుక్స్(Trendy looks)తో.. ఫుల్ జోష్ తో.. డ్యాన్స్ చేస్తున్నారు. తెర పై పవన్ ను ఇంత ట్రెండీగా చూసి చాలా రోజులు అయ్యింది. అందుకనే అభిమానులు ఈ సాంగ్ ప్రొమో చూసి తెగ సంబరపడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి రానుంది. మరి.. ఈ సాంగ్ ప్రొమోనే ఇలా ఉంటే.. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే.. యూట్యూబ్ షేక్(YouTube Shake) అవ్వడం ఖాయం అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

