Peddamallareddy | 24 గంటలు అందుబాటులో..

Peddamallareddy | 24 గంటలు అందుబాటులో..
Peddamallareddy, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాలగోని రాజా గౌడ్ అన్నారు. తమ పై నమ్మకంతో గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తానని చెప్పారు.
ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తానన్నారు. ఎవరికి ఆపద వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని తెలిపారు. తమ పై నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. యువత కోసం ప్రత్యేక జిమ్ ఏర్పాటుతో పాటు డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
