CPI | జోరుగా సీపీఐ అభ్యర్థి ప్రచారం..

CPI | దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట గ్రామ పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో కాంగ్రెస్, జనసేన, సీపీఐ ఎంఎల్ బలపరచిన 2 వ వార్డు సీపీఐ అభ్యర్థి బత్తుల సాయి 2 వ వార్డులో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. దమ్మపేటలోని బంజారకాలనీలో గాయత్రీ నగర్ లో సర్పంచ్ అభ్యర్థి పగడాల రమాదేవి, వార్డు అభ్యర్థులతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి పగడాల రమాదేవి గుర్తు బ్యాటు, వార్డు సభ్యుడు బత్తుల సాయి గుర్తు గౌను కు తమ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి వెంకట రామారావు ,పగడాల రాంబాబు, చిన్నశెట్టి యుగంధర్, చిన్నశెట్టి చిట్టిబాబు, సిపిఐ మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ, నల్లా ప్రసాద్, దొంగా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ ఎంఎల్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply