- వెల్టూర్ సర్పంచ్ అభ్యర్థి తొంట కిష్టయ్య
సదాశివపేట రూరల్, ఆంధ్రప్రభ : అభివృద్ధికి పట్టం కట్టండి.. వెల్టూర్ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని వెల్టూరు సర్పంచ్ అభ్యర్థి తొంట కిష్టయ్య అన్నారు. వెల్టూర్ ప్రజలు తనను ఆదరించి.. అభిమానించి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలకు కృషి చేస్తానన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ సేవకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలకు కోరారు. గ్రామంలో మౌలిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలుఅంఉంగరం గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్న కిష్టయ్యదించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

