CM | సీఎం సార్‌.. సమస్యలను పరిష్కరించండి

CM | సీఎం సార్‌.. సమస్యలను పరిష్కరించండి

  • చంద్రబాబుకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

CM | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : గుడివాడ నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ.. పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) అందజేశారు. గురువారం రాత్రి అమరావతిలోని సీఎంఓ కార్యాలయంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు(Chandrababu)ను ఆయ‌న కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలను వివరించారు.

శుక్రవారం ఎమ్మెల్యే రాము గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు అందించిన ప్రతిపాదనల వివరాలను వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గంలో అత్యంత ప్రధానమైన సమస్యలలో ఒకటైన శ్మ‌శాన వాటిక(Cemetery)ల ఏర్పాటు ఆవశ్యకతను సీఎంకు వివరించి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశానన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, హిందూ, క్రిస్టియన్, ముస్లిం శ్మ‌శాన వాటికల ఏర్పాటు కోసం గుడివాడ పట్టణంలో 10 ఎకరాలు, నియోజకవర్గ వ్యాప్తంగా(Constituency wide) అవసరమైన ప్రధాన ప్రాంతాల్లో మరో 35 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదనలు అందించామన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు ప్రతిపాదనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార‌సు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

దేశంలో తొలిసారిగా ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమానికి నందివాడ మండలం ఎంపికైందని, ప్రాజెక్టు(project) ముందుకు వెళ్లడంలో ఎదురవుతున్న సమస్యలను సీఎంకు వివరించానన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతుల పంటకు డిమాండ్ పెరగడమే కాకుండా, పంటపై రుణాలు పొందడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం(Insurance facility) ఉంటుందన్నారు. యూనిక్ ఐడీలపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం పేర్కొన్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలో సమస్యలు అనేకం ఉన్నా.. అత్యంత ప్రధానమైన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. అనంతరం గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఉన్న ఎన్‌హెచ్.216 రహదారి బస్టాండ్(bus stand) సెంటర్ నుంచి నాగవరప్పాడు సెంటర్ వరకు ఎండ్ టూ ఎండ్ రోడ్డు అభివృద్ధికి మంజూరైన రూ.17.95 కోట్ల నిధులను విడుదల చేయాల్సిందిగా ఎన్‌హెచ్ఆర్‌వో కార్యాలయ ఈఈ శశాంక్‌ను ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply