TDP | అగ్నిమాపక భవనం నిర్మాణం 40 ఏళ్ల కల

TDP | అగ్నిమాపక భవనం నిర్మాణం 40 ఏళ్ల కల

  • ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
  • అగ్నిమాపక నూతన భవన కేంద్రానికి భూమిపూజ
  • 2.25 కోట్లతో నూతన భవన నిర్మాణం

TDP | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అగ్నిమాపక భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అధికారులు, టీడీపీ సీనియర్ నాయకులతో కలసి ఎమ్మెల్యే (MLA) అమిలినేని సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే చొరవతో రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కంబదూరు రోడ్డులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో 60 సెంట్ల స్థలంలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్నిమాపక భవనం నిర్మాణం 40 ఏళ్ల కల అని అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, ఇదే విషయాన్ని రాష్ట్ర హోమ్ మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలన్నారు.

Leave a Reply