Andhra prabha | అన్నివర్గాల అభివృద్ధికి కృషి

Andhra prabha | అన్నివర్గాల అభివృద్ధికి కృషి

  • గుంతపల్లి సర్పంచ్ అభ్యర్థి కలాల్ రామచందర్ గౌడ్

Andhra prabha | కొండాపూర్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని గుంతపల్లి సర్పంచ్ అభ్యర్థి కలాల్ రామచందర్ గౌడ్(Kalal Ramachander Goud) అన్నారు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ ఆదరించి అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని(To vote) కోరారు.

తమను గెలిపిస్తే అభివృద్ధిని స్వాగతించినట్టేనని ఓటర్లను కలిసి కోరారు. అవకాశం ఇస్తే అభివృద్ధి (Development) చేసి చూపిస్తానని ప్రజలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంతపల్లి అభ్యర్థి కలాల్ రామచందర్ గౌడ్, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తెగు మల్లేశం, విక్రంగౌడ్, సుధాకర్ గౌడ్, బిచ్చగౌడ్, జనార్దన్ రెడ్డి, అంజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply