World Record | మ‌హాకుంభ‌మేళా @ 50 కోట్లు

ఆధ్మాత్మిక యాత్ర‌లో స‌రికొత్త రికార్డ్
ప్ర‌పంచంలోనే ఇంతమంది పుణ్య స్నానం ఆచ‌రించ‌డం ఇదే తొలిసారి
ఈ నెల 25తో ముగియ‌నున్న మ‌హా ఆధ్యాత్మిక జాత‌ర‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మరో రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మహా కుంభమేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణి సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 50 కోట్లకుపైగా భక్తులు మహా కుంభమేళాల పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. భారత్, చైనాలు మినహా మిగ‌తా జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని యూపీ ప్రభుత్వం పేర్కొంది.

144 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు రావచ్చని మొదట అంచనా వేసినప్పటికీ అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మనదేశం నలుమూలల నుంచే గాక, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటం గమనార్హం. ప్రతి రోజు దాదాపు కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం గమనార్హం.

Leave a Reply