SEVA | ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు

SEVA | ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు

SEVA | వెల్లంకి తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

రామన్నపేట, ఆంధ్రప్రభ : వెల్లంకి గ్రామంలో ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ పేద ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,వెల్లంకి తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి (Edla Mahender Reddy) అన్నారు. ఆదివారం నాడు గ్రామంలో సంస్థ అధ్యక్షులు ఇడెం రాధా శ్రీనివాస్ (Idem Radha Srinivas) రెండు లక్షల రూపాయలతో సమకూర్చిన ప్యూరిఫైడ్ 20 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రింకింగ్ వాటర్ క్యాన్లను ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇడెం స్వరూప సేవా సంస్థ అధ్యక్షులు ఇడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు,గ్రామ పేద ప్రజల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పన్న్న వెంకటేశం, కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, తలారి నరసింహ, గంజి రంగయ్య, సండ్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply