Utkoor | సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

Utkoor | సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
గణాంకాలశాఖ జెఎస్ వో
రాకేష్ కుమార్ రెడ్డి
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : జాతీయ గణాంకాల సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జె ఎస్ వో అధికారి రాకేష్ కుమార్ రెడ్డి (Rakesh Kumar Reddy) అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో అక్షరాస్యులు, నిరక్షరాశులు నిరుద్యోగులపై సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో చదువుకున్న వారు చదువుకొని వారు ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకుని ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయి (National level) లో నిరుద్యోగుల వివరాలు తెలుసుకునేందుకు గ్రామాల్లో జూనియర్ స్టాటిస్టికల్ సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. ఇంటింటికి వచ్చే అధికారులకు సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరారు. ఊట్కూర్ పట్టణంలోని పలు ఇండ్లకు తిరిగి సర్వే చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సిబ్బంది పోలప్ప, కనకప్ప, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
