108th | తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జ‌యంతి వేడుక‌లు…

108th | తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జ‌యంతి వేడుక‌లు…

108th | కొమురవెల్లి, ఆంధ్రప్రభ : కొమురవెల్లి మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకల(108th Anniversary Celebrations)ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్(Mahadevi Srinivas) ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ దేశంలో గరీబీ హటావో అని దేశంలో బీద ప్రజలు ఉండవ‌ద్దని చూసిన తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ(first woman Prime Minister Indira Gandhi)ని కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్(Mahadevi Srinivas), మండల ఉపాధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, మల్లికా స్వామి దేవాలయం టెంపుల్ డైరెక్టర్ లింగపల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి లింగం, వెంకి కనకయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచి రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రామ లింగంపల్లి కనకరాజు, మల్లం బాలయ్య, జనగాం శ్రీకాంత్, తురాయి నవీన్, మేడికుంట శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు రాజు, చింతల రమేష్, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.