Harish Rao | రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి…

Harish Rao | రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి…

వరంగల్ మార్కెట్లో బీఆర్ఎస్ నేతల పర్యటన
రైతులతో ముచ్చటించిన హారీష్ రావు, ఎర్రబెల్లి


Harish Rao | వరంగల్, ఆంధ్రప్రభ : రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని మాజీ మంత్రులు త‌న్నీరు హ‌రీష్ రావు (Thanniru Harish Rao), ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao) లు డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరు గాంచిన వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులు క్రయ, విక్రయాలను పరిశీలించారు. రైతు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలను తెలుసుకున్నారు.

వ్యాపారులిస్తున్న ధరలు గిట్టుబాటు అవుతున్నాయా అని వాకబు చేశారు. అలాగే పత్తి కొనుగోళ్ళ నిలిపివేతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న యార్డులో రైతుల (farmers) సమస్యలను మాజీ మంత్రులిద్దరూ అడిగి తెలుసుకున్నారు. రైతుల కష్టాలను కడతేర్చే విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరును వారు తప్పు పట్టారు. రైతుల (farmers) కు గిట్టుబాటు ధరలు లభించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలు సాగిస్తామని మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు హెచ్చరించారు.