Maktal | శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో 19న సప్తశక్తి సంఘం మాతృ సమ్మేళనం…

మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ శిశుమందిర్ మక్తల్ పాఠశాలలో ఈ నెల 19న ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సప్తశక్తి సంఘం మాతృ సమ్మేళనం జరుగనున్నట్లు కార్యక్రమ ప్రముఖ్ శాంతాబాయి తెలిపారు.

సోమవారం పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారతీయ చరిత్రలో మహిళ స్థానానికి అపారమైన విలువ ఉందని, మహిళల్లో ఉన్న సప్త లక్షణాలను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, భారత నిర్మాణంలో స్త్రీల పాత్ర, నారీశక్తి యోగదానం వంటి అంశాలపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు.

మహిళా చైతన్యం కోసం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో కళాశాల యువతులు, మహిళలు, తల్లులు పాల్గొనాలని శాంతాబాయి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ వివరాల సమావేశంలో సప్తశక్తి సంఘం నిర్వాహకులు సరిత, నరుశ్రీ, సరస్వతీ, జ్యోతి పాల్గొన్నారు.

Leave a Reply