CONGRESS |సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం

CONGRESS |సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం
•కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ పటేల్
CONGRESS |డోంగ్లి, ఆంధ్రప్రభ : సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ పటేల్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా (kamareddy District) డోంగ్లి మండలంలోని ఇలేగావ్ గ్రామం లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూంలు ఇస్తా అని ఆశ చూపి ఇవ్వలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్ పటేల్ (Chand Patel) పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, గ్రామా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్దిదారులు నాయకులు పాల్గొన్నారు.
