Gold | ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌..

Gold | ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌..

  • త‌గ్గిన గోల్డ్ రేటు

బిజినెస్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గోల్డ్ ధ‌ర‌లు ఏ మాత్రం త‌గ్గినా ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్తే. ప్ర‌తిరో్జూ బంగారం (Gold) ధరల్లో హెచ్చు తగ్గులు క‌నిపిస్తుంటాయి. గ‌త నెల‌లో భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈ నెల‌లో కాస్తా ఊర‌ట‌నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఒకరోజు రేట్లు తగ్గినా కాస్త ఊరటనిస్తుంది. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఈ రోజు కాస్తా త‌గ్గింది. వెండి ధ‌ర మాత్రం వ‌రుసుగా ఐదోరోజు పెరిగింది. మ‌దుప‌రులు కూడా బంగారం ధ‌ర‌లు ప‌రిశీలించి త‌మ పెట్టుబ‌డుల కోసం వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. గ‌త నెల కంటే ఈ నెల బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ఉంది. మ‌రో వారం రోజుల నుంచి పెళ్లి కార్య‌క్ర‌మాలు అధికంగా ఉన్నాయి. దీంతో బంగారం ధ‌ర పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి.. రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.70 తగ్గి.. 11,720గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప‌ది గ్రాముల పుత్తడి ధర రూ.1,27,850గా, 22 క్యారెట్ల ధర రూ.1,17,200గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.800, 22 క్యారెట్లపై రూ.700 తగ్గింది.

Gold

హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల ధర రూ.1,27,850, కాగా 22 క్యారట్ల ప‌ది గ్రాముల ధర రూ.1,17,200గా పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా ఐదవ రోజు పెరిగాయి. కిలో వెండిపై నిన్న ఏకంగా 11 వేలు పెరగగా.. ఈ రోజు స్వల్పంగా రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,73,100గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో రూ.1,83,000గా కొనసాగుతోంది.

Gold Price | ఊహించ‌ని షాక్‌.. ప‌సిడి ర‌న్‌!