POLICE DIAL 112| అత్యాధునిక కమాండ్ సెంటర్‌

POLICE DIAL 112 | జిల్లా ఎస్పీ తుషార్ దూడి

POLICE DIAL 112| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో ప్రజల భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చిత్తూరు జిల్లా పోలీసులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సెంటర్ పనితీరును పరిశీలించడానికి జిల్లా పోలీసు అధినేత తుషార్ డూడి ఈ రోజు చిత్తూరు పట్టణంలోని కమాండ్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరా నియంత్రణ వ్యవస్థ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, అత్యవసర ప్రతిస్పందన విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. నగరంలోని ముఖ్యమైన స్థలాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను లైవ్గా చూసి, వాటి పనితీరు గురించి సిబ్బంది నుండి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శక్తి యాప్పపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళలు లేదా బాలికలు అత్యవసర స్థితిలో యాప్ప ద్వారా ఎస్ఓఎస్ సంకేతాన్ని పంపితే, అది కంట్రోల్ సెంటర్లో వెంటనే రిసీవ్ అవుతుందని, ఆ తర్వాత సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం చేర్చడం ద్వారా త్వరితగతిన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తామని పోలీసులు వివరించారు. శక్తి యాప్పలోని ఎస్ఓఎస్ సంకేతం, మహిళలు మరియు బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలని జిల్లా పోలీసు అధినేత తెలిపారు.

POLICE DIAL 112| డయల్ 112 విభాగాన్ని పరిశీలించారు. ప్రజలకు అత్యవసర పోలీసు, వైద్య, అగ్నిమాపక సేవలను అందించే ఈ నంబర్కు వచ్చే ప్రతి కాల్కూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కమాండ్ సెంటర్లోని సిబ్బంది, డయల్ 112 సిబ్బంది మరియు గస్తీ వాహనాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అత్యవసర కాల్ ఒక ప్రాణాంతక పరిస్థితిని సూచిస్తుంది. స్పందన సమయాన్ని తగ్గించి, బాధితులకు తక్షణ సహాయం అందించడం, నేరాలను నివారించడం మా ప్రధాన లక్ష్యం అని అధినేత పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సబ్-ఇన్స్పెక్టర్లు సురేంద్ర, మోబీన్ తాజ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు ప్రజారక్షణ సేవలను అందించడం తమ దృఢమైన సంకల్పం అని పేర్కొన్నారు.

Leave a Reply