Warangal | కలెక్టర్‌కు వినతి పత్రం…
Warangal | కలెక్టర్‌కు వినతి పత్రం…
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ పై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రస్మ, వడుప్స(Trasma, Vadupusa) ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ రోజు వడుప్స జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యామ్(Aadepu Shyam) ఆధ్వర్యంలో 34వ డివిజన్ శివనగర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
స్వచ్ఛందంగా ప్రైవేట్ పాఠశాలలు(Private Schools) బందు పాటించారు. సమావేశంలో వడుప్స ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. హనుమకొండలోని స్మైలీ బిజీ స్కూల్(Smiley Busy School) కరెస్పాండెంట్ ఎం శ్రీనివాస్ పై పీడీఎస్‌యు విద్యార్థి సంఘం నాయకులు చందా కొరకు వచ్చి ఇవ్వనందుకు ఆయనపై భౌతికంగా దాడి చేశారని వడుప్స ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించామని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంకం వీరస్వామి, ట్రస్మా వడుప్సా, వరంగల్ జిల్లా సలహాదారుడు కోడం శ్రీధర్, ఇతర పాఠశాలల కరెస్పాండెంట్ పాల్గొన్నారు.
