ఆ.. MLA పట్టించుకోకపోవడంతో..

ఆ.. MLA పట్టించుకోకపోవడంతో..

గన్నేరువరం, ఆంధ్రప్రభ: మండల కేంద్రానికి ప్రధాన రహదారి అయిన గుండ్లపల్లి – పొత్తూరు డబుల్ రోడ్డు కోసం నిధులు విడుదల కాకపోవడంతో, డబుల్ రోడ్, కల్వర్టు పనులు రెండు సంవత్సరాలు దాటినా పూర్తవ్వలేదు. MLA పట్టించుకోకపోవడంతో మండలానికి ఉన్న ప్రధాన రహదారి గుండా వచ్చే స్కూల్ బస్సులు, అంబులెన్స్ ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్, జిల్లా కలెక్టర్ పమేళ సత్పతికి ప్రజావాణి కార్యక్రమంలో లో ఫిర్యాదు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడితే ప్రధాన రహదారులు పూర్తిగా మూసుకుపోతాయి. దీని వలన జలదిగ్బంధంలో మండలం ఉంటుందని.. పాత కల్వర్టుల పై గ్రానైట్ లారీలు అధిక లోడ్‌తో వెళ్తుండటంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి అన్నారు. అత్యవసరంగా వెళ్లే ప్రజలు బయటకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రజల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని, మంజూరైన డబుల్ రోడ్డు, కల్వర్టు పనులను వెంటనే ప్రారంభించాలని, రహదారులను ధ్వంసం చేస్తున్న గ్రానైట్ లారీల పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Leave a Reply