బియ్యపు గింజ పై వందేమాతర గీతం

నర్సంపేట, ఆంధ్రప్రభ : మాతృభూమి దాస్యశృంకలాలను తెంచేందుకు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వందేమాతర గీతాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ బియ్యపు గింజపై చెక్కి ఔరా అనిపించారు. బకించంద్ర చటర్జి రాసిన ఈ గీతం నేటికీ వందేళ్లు పూర్తైన సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ బియ్యపు గింజపై 191 ఆంగ్ల అక్షరాలతో రాసిన వందేమాతర గీతంను మరోసారి మననం చేసుకున్నారు. ప్రజలంతా కూడా దేశభక్తిని కొనసాగిస్తూ దేశ ఉన్నతిలో భాగస్వామ్యులు కావాలని జయకుమార్ ఆకాంక్షించారు.

Leave a Reply